
ఇన్సైడర్ న్యూస్(సినిమా): సినీ నిర్మాణ బడ్జెట్‌పై ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి నిర్మాణ బడ్జెట్ పరిమితిని విధించినపుడే ఆరోగ్యకరమైన వినోదాన్ని సగటు సినీ ప్రేక్షకుడు పొందగలడని ఇన్సైడర్ పత్రిక నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్‌తో తీయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని, పేషన్‌తో సినిమాలు నిర్మించడం తగ్గిపోయిందని సినీ అభిమానులు పేర్కొన్నారు. సినిమా ప్రధాన లక్ష్యం వినోదం. కుటుంబమంతా కూర్చుని హాయిగా కాస్సేపు వినోదాన్ని ఆస్వాదించేలా సినిమాలు లేవన్నారు. వందలకోట్లు పెట్టి పిల్లల ఆలోచనలను డైవర్ట్ చేసేలా, సెక్స్, సంఘవ్యతిరేక కార్యకలాపాలు ప్రోత్సహించి విద్యార్థుల మనసులను కలుషితం చేసేలా సినిమాలు ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విపరీతమైన బడ్జెట్ పెట్టడం, ఆ పెట్టుబడిపై లాభాలకోసం సినిమా బాగున్నా బాగోలేకపోయినా హైప్ క్రియేట్ చేయడం పరిపాటిగా మారాపోయిందన్నారు. ప్రివ్యూ షోలు పేరుతో రిలీజ్ తేదీ నుండి కొద్దిరోజులపాటు టికెట్ల ధరలను భారీగా పెంచి ప్రేక్షకుల బలహీనతతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.
భవిష్యత్తులో సినిమా నిర్మించే బడ్జెట్‌పై సీలింగ్ విధిస్తే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సీలింగ్ పరిమితిని మించి నిర్మించిన సినిమాలపై ప్రభుత్వాలు జాలి చూపించాల్సిన అవసరం ఉండదని అభిప్రాయసేకరణలో తెలిపారు. దీనివలన భారీ టికెట్ల రేట్ల నుండి ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచించి ఒక చట్టం తీసుకురావాలని సగటు సినీ అభిమానులుగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. దీని వలన ఆరోగ్యకరమైన వినోదాన్ని పొందగలమని తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆ దిశగా నియంత్రించలేకపోతే పెద్ద బడ్జెట్ సినిమా విడుదుల అయిన ప్రతీసారి టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతినివ్వకూడదని కోరుతున్నారు.

Leave a Reply