(ఇన్సైడర్ న్యూస్): వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో, విప్రో కేర్ ఫౌండేషన్ మద్దతుతో, విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండల కార్యాలయంలో పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ (POCSO) చట్టం పై శిక్షణ కార్యక్రమం తేదీ డిసెంబర్ 23న జరిగింది. ఈ కార్యక్రమం Child Sexual Abuse Project లో భాగంగా జరిగింది. శిక్షణ లో భాగంగా సామాజికవేత్త వై ఏ ఆర్ కె ప్రసాద్ పోక్సో చట్టం గురించి వివరించారు. చట్టంలోని నిబంధనలు, నేరం రుజువైతే విధించే శిక్షలు, ఇతర చట్టపరమైన రక్షణ చర్యలను వివరించారు. అదేవిధంగా G. శ్రీనివాస్ రావు, CHO గారు పిల్లల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు, మరియు సమాజం, కుటుంబం కలసి పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యతతో వివరించారు. ఈ శిక్షణ ద్వారా పాల్గొన్న ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, మరియు సామాజిక కార్యకర్తలు పిల్లల రక్షణకు సంబంధించిన చట్టపరమైన అవగాహనతో పాటు, మానసిక ఆరోగ్య పరిరక్షణలో తమ పాత్రను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మాధవి గారు మరియు PC వరలక్ష్మి staff కూడా పాల్గొన్నారు.

Leave a Reply