ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయులకు ఇవే చివరి బదిలీలా….!?
ఇన్‌సైడర్ న్యూస్(విజయవాడ): ఇటీవల జరిగిన సాధారణ బదిలీలే ఉపాధ్యాయులకు ఉమ్మడి జిల్లాల్లో చివరి బదిలీలుగా ఉంటాయని ఆలిండియా ఉద్యోగ,ఉపాధ్యాయ , కార్మికుల సమాఖ్య(ఎయుయుకెఎస్) రాష్ట్ర నాయకులు పేరొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత ముందుగా కలెక్టర్లు, ఎస్పీలు వంటి జిల్లా స్థాయి అధికారులను నియమించారు. అన్ని జిల్లాల్లో ఆఘమేఘాలపై జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులను తాత్కాలికంగా జిల్లాలకు కేటాయించారు. కేడర్ స్ట్రెంగ్త్ పరంగా కూడా పోస్టులు విభజన జరిగినట్లు తెలుస్తోంది. అందుకు ఇటీవల ఖజానా శాఖలో జరిగిన బదిలీలే నిదర్శనం. అయితే ఆ పోస్టుల్లో తాత్కాలికంగా సర్దుబాటు జరిగినా భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన శాస్త్రీయ పద్ధతిలో ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల కేటాయింపు కూడా జిల్లాల మధ్య జరగాల్సి ఉంది. తెలంగాణాలో 2016లో జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత 2022లో ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజించి జిల్లాలకు కేటాయించారు. అంటే సుమారు 5 సంవత్సరాలు పైనే పట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన 2022లో జరిగింది. తెలంగాణాలో మాదిరిగానే ఎపిలో కూడా ఉద్యోగుల విభజన జరగాలి. అయితె తెలంగాణాలో జరిగినంత జాప్యం ఎపిలో ఉండదని నాయకుల అభిప్రాయం. కేంద్రప్రభుత్వం నుండి రావాల్సిన కొన్ని సాంకేతిక పరమైన క్లియరెన్స్‌లు ఇంకా రానందున ఈ జాప్యం జరుగుతోంది. ఒకవేళ కేంద్రం నుండి సానుకూలంగా త్వరలోనే దీనిపై క్లియరెన్స్ వచ్చినట్లైతే ఉపాధ్యాయుల, ఉద్యోగుల విభజన త్వరలోనే జరుగుతుంది.
ఇటీవలే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడబోయే ప్రభుత్వం కేంద్ర నుండి దస్త్రాన్ని వేగంగా రప్పించుకుని ఉద్యోగుల విభజనకు శ్రీకారం చుట్టినట్లైతే కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఈ కేటాయింపు ఉంటాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ మరలా ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. అందువల్ల ఉమ్మడి జిల్లా యూనిట్‌గా భవిష్యత్తులో బదిలీలు ఉండవు. కొత్త జిల్లా యూనిట్‌గానే బదిలీలు ఉండే అవకాశం ఉందని ఎయుకెఎస్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
(తెలంగాణాలో జిల్లా పునర్విభజనలో భాగంఆ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన జరిగిన విధివిధానాలు పై మరొక వ్యాసం త్వరలో….)
For more news visit our website news page: https://amoolyaservices.com/blog/
Leave a Reply