ఇటువంటి ఉపాధ్యాయులను గుర్తించి సస్పెండ్ చేయాలి
ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని రాద్ధాంత చేసే సంఘాల నాయకులకు ఇటువంటి ఉపాధ్యాయులను చూపించి ఎందుకు చేయకూడదో అడగాలని విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు కోరుతున్నారు. వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. ఇటీవల అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఒక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు వెళ్లారు. అక్కడ పాఠశాల తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఒక సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడిని పిలిచి ప్రభుత్వం ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌గా అమలు చేస్తున్న లిప్(లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్) గురించి అడిగారు. సదరు ఉపాధ్యాయుడు తనకేమీ తెలియదని తెల్లమొహం వేశాడు. లిప్ శిక్షణ పొందారా అని కలెక్టర్ అడిగితే శిక్షణ పొందానని చెప్పాడు. కానీ లిప్ గురించి తెలియదన్నట్లుగా బిక్కమొహం పెట్టాడు. వినడానికి ఇది ఫన్నీగా ఉన్నా, సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం ఇది. నెలకు సుమారు 80 వేల రూపాయల జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడిని ఏం చేయాలి? ఇటువంటి ఉపాధ్యాయులు ఉండటం వలనే ప్రభుత్వ విద్యారంగం అంటే అందరికీ చులకన అయిపోయిందని స్థానిక పరిరక్షణ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉపాధ్యాయుల వలన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు నిర్ణీత సిలబస్ కూడా పూర్తి చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని తమ పర్యటనలో తెలిసిందని పేర్కొన్నారు. ఇటువంటి ఉపాధ్యాయులను గుర్తించి వారిని సస్సెండ్ చేయాలని సదరు నాయకులు డిమాండ్ చేశారు.
for more news : https://amoolyaservices.com/blog/
Leave a Reply