ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ విజయవాడహైదరాబాద్ రహదారి దిగ్బంధనం
ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణపై జరుగుతున్న ఉద్దేశపూర్వక జాప్యానికి నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎం.ఆర్.పి.ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ పిలుపుతో ఫిబ్రవరి 13న చేపట్టిన విజయవాడ
హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. పోలీసులకు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులపై ఉద్యమకారులు రాళ్లురువ్వారు. ఈ సందర్భంగా దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొనకుండా మందకృష్ణ ముందస్తు అరెస్టు చేసి అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు ఆధ్వర్యంలో నిర్సన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కేంద్రంలో అధికారంలోకి ఇచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపించారు. పార్లమెంట్ లో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉండి ఎన్నో బిల్లులను ఆమోదింపజేసుకుంటూ, ఎన్నో రాజ్యాంగ సవరణల బిల్లులను నెగ్గించుకున్న బీజేపీ ఒక్క ఎస్సీ వర్గీకరణను మాత్రమే విస్మరించడంతో బిజెపి మోసపూరిత వైఖరి బయటపడిరదన్నారు.
Leave a Reply