జిల్లా స్థాయి అండర్`17 హైజంప్‌లో ఎ.కోడూరు విద్యార్థినికి ప్రథమ స్థానం
పతకాలుతో కె.ఎల్.తులసి, డి.రాహుల్. వారితోపాటు ఫిజికల్ డైరెక్టర్ వై.ఎ.ఆర్.కె.ప్రసాద్ మరియు ఆర్.రమేష్ చిత్రంలో ఉన్నారు
ఇన్‌సైడర్ న్యూస్(అనకాపల్లి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన జిల్లా స్థాయి అండర్17 బాలికల హైజంప్ సెలక్షన్ ట్రయల్స్ పోటీల్లో కె.కోటపాడు మండలం అలమండ కోడూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.శ్రీలక్ష్మి తులసి ప్రథమ స్థానం సాధించింది. అనకాపల్లి ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాలలో తేది.12.11.2022 శనివారం ఈ సెలక్షన్ ట్రయల్స్ పోటీలు జరిగాయి. అలాగే అండర్14 బాలుర హైజంప్ విభాగంలో డి.రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. వీరిద్ధరూ ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి పోటీలు హైజంప్ ఈవెంట్‌లో అనకాపల్లి జిల్లాకి ప్రాతినిథ్యం వహిస్తారు. పోటీల అనంతరం తులసికి, రాహుల్‌కు మెడల్స్ ప్రధానం చేశారు. పతకాలు సాధించిన ఇద్దరినీ ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.అనూరాధ మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.
Leave a Reply