
ఇన్‌సైడర్ (స్పోర్ట్స్ న్యూస్): విశాఖపట్నం కొమ్మాదిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్‌గాలియెట్ వెల్లడిరచారు. ఇన్‌సైడర్ స్పోర్ట్స్ కరస్పాండెంట్‌తో ఆమె మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా మొత్తం 22 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తక్షణమే నిర్మాణ పనులు చేపడతామన్నారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లైతే విశాఖపట్నం క్రీడాకారులు, క్రీడాభిమానుల కల నిజమైనట్లే.నన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే జిల్లాలో క్రీడాకారులు ఎంతో మంది తయారవుతారన్నారు. టాలెంట్ ఉండి కూడా మైదానాలు లేక శిక్షణ, ప్రాక్టీస్ కొరవడి మరుగున పడిపోతున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అనేక మైదానాలు ఉన్నా కూడా వాటిలో ప్రవేశము లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే రాష్ట్రప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంపెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ మరియు అవుట్ డోర్ గేమ్స్ సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికే తలమానికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply