ఇన్‌సైడర్‌ న్యూస్‌(విశాఖపట్నం): రాధా ఆర్ట్స్‌ సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంప్‌ వివిధ రకాల చిత్రలేఖనం, శిల్పకళ వంటి అనేక కళలు నేర్చుకోడానికి వేదికగా ప్రారంభమైంది. సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఔట్‌లో ఈ వేసవి శిక్షణా శిబిరం కళల నేర్చుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థులకోసం ప్రారంభించినట్లు రాధా ఆర్ట్స్‌ సంస్థ నిర్వాహకురాలు జి.రాధ తెలియజేశారు. అత్యున్నత క్వాలిఫైడ్‌ ఇన్‌స్ట్రక్టర్లతో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేసవిలో ప్రత్యేక కళలను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి రాధా ఆర్ట్స్‌ వేదికగా ఉంటుందన్నారు. చిత్రలేఖనం, పెయింటింగ్‌, శిల్పకళ, హ్యాండ్‌ రైటింగ్‌, ఒరిగామి, చదరంగం వంటి అంశాల్లో అన్ని వయస్సుల వారికి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు రాధా ఆర్ట్స్‌ నిర్వాహకులను 9963165689 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని కోరారు

Click here for more news

About Author

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *