మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్‌లో విజేతలుగా నిలిచిన వ్యాయామోపాధ్యాయులు సింహాచలం, డి.నరసింగరావు, కె.రవి
ఇన్‌సైడర్ న్యూస్, విశాఖ సిటి(క్రీడలు): విశాఖ జిల్లా మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో ఆదివారం (అక్టోబర్ 8) జరిగిన పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామోపాధ్యాయులు ప్రతిభ కనబరచి వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచారు. 45 ప్లస్ వయస్సు విభాగంలో జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పనిచేస్తున్న సింహాచలం లాంగ్ జంప్‌లో మొదటి స్థానం, 100 మీటర్స్‌లో రెండో స్థానం సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వడ్డాదిలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పనిచేస్తున్న డి.నరసింగరావు షాట్‌పుట్ మొదటి స్థానం, డిస్కస్ త్రోలో రెండో స్థానం సాధించారు. అదే వయస్సు విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పంచదార్లలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పనిచేస్తున్న కంభంపాటి రవి డిస్కస్ త్రోలో మొదటి స్థానం, షాట్‌పుట్‌లో రెండో స్థానం సాధించారు. వీరు డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటారు. మంచి ప్రతిభ కనబరచిన వ్యాయామోపాధ్యాయులను పలువురు అభినందించారు.
Leave a Reply