రాష్ట్ర స్థాయిలో కెజిబివి పాఠశాలల టాపర్లుగా అనకాపల్లి విద్యార్థినిలు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అనకాపల్లి కెజిబివి పాఠశాలల్లో 83 % ఉత్తీర్ణత

ఇన్ సైడర్ న్యూస్ (అనకాపల్లి): బై.పి.సి. విభాగం రాష్ట్ర స్థాయిలో కెజిబివి పాఠశాలల టాపర్ గా  973 మార్కులతో అనకాపల్లి జిల్లాకి చెందిన నర్సీపట్నం కెజిబివి విద్యార్థిని వి.నాగలక్ష్మితోపాటుమొదటి సంవత్సరం బై.పి.సి  గ్రూప్ లో 430 మార్కులతో నక్కపల్లి కెజిబివి విద్యార్థిని పి.భవాని కూడా రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచింది.నిలిచింది. ఒకేషనల్ విభాగం లో కూడా కెజిబివిల్లో రాష్ట్రస్థాయిలో ఎం.పి హెచ్ డబ్ల్యు. గ్రూప్ లో 969 మార్కులతో రోలుగుంట కెజిబివి విద్యార్థిని కే.మాధవి మరియు ఎం.ల్.టి.గ్రూప్ లో చోడవరం కెజిబివి విద్యార్థిని గంట దివ్య, రాంబిల్లి కెజిబివి విద్యార్థిని సి.హెచ్.రజిని లు 482 మార్కులతో  ప్రధమ స్థానం సాధించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల్లో కెజిబివి అనకాపల్లి జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జిల్లాలోని 20 కెజిబివి పాఠశాలల నుండి మొత్తం 465 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరవ్వగా 386 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 72.86 % ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 619 మంది విద్యార్థులు హాజరవ్వగా 451 మంది ఉత్తీర్ణత సాధించారు. అనకాపల్లి కెజిబివి పాఠశాలల్లో ఎం.ల్.టి.గ్రూప్ లో 969 మార్కులతో చోడవరం కెజిబివి విద్యార్థిని సి.హెచ్.తులసి జిల్లాలో టాపర్ గా నిలిచింది. ఎం.పి.సి. గ్రూప్ లో 917 మార్కులతో మాకవరపాలెం కెజిబివి విద్యార్థిని జి.భాగ్యలక్ష్మి జిల్లాలో టాపర్లు గా నిలిచారు. ఎం.పి.సి  గ్రూప్ లో 453 మార్కులతో దేవరాపల్లి కెజిబివి విద్యార్థిని డి.అనిత,  ఎం.పి హెచ్ డబ్ల్యు. గ్రూప్ లో రోలుగుంట  కెజిబివి విద్యార్థిని ఆర్.భావన 485 మార్కులు సాధించి కెజిబివి పాఠశాలల్లో టాపర్లు గా నిలిచారు. అనకాపల్లి జిల్లా ఏపిసి మరియు జిల్లా విద్యాశాఖాధికారిని ఎం.వెంకట లక్ష్మమ్మ ఈ సందర్బంగా విద్యార్థినిలను అభినందించారు

About Author

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *