బేషరతుగా ఒప్పందానికి రాకపోతే  మారణహోమమే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ఇన్‌సైడర్ న్యూస్(ఇంటర్నేషనల్ డెస్క్): బేషరతుగా ఒప్పందానికి రాకపోతే రాతి యుగం కాలం నాటి పరిస్థితులకు దారితీసేలా ఇరాన్‌లో మారణహోమం సష్టిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం పబ్లిక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ హెచ్చరికను జారీ చేశారు. ఆధునిక కాలంలో అభివద్ధి చేసుకున్న ఆస్పత్రులు, పాఠశాలలు, యూనివర్శిటీలు, పరిశ్రమలు, వ్యాపారాలు, ీVAటళ్లు, ఆకాశహర్మ్యాలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలన్నింటినీ నాశనం చేస్తామని ఈ హెచ్చరిక సారాంశం. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్‌పై అణుబాంబు ద్వారా నేలమట్టం చేస్తామన్నట్లుగా ట్రంప్ వ్యాఖానం ఉన్నట్లుగా పలువురు యుద్ధ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ బెదిరింపు కేవలం ఇరాన్‌ను దారికి తెచ్చుకోడానికా లేక నిజంగానే ఈ రకమైన దాడికి దిగుతారా అనేది ట్రంప్ మదిలోనే ఉంది. ట్రంప్ ఎప్ప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ హెచ్చరిక ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇరాన్ నాయకత్వం ఇంకా స్పందించలేదు.

For more news visit our news page https://amoolyaservices.com/blog/

About Author

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *