పాలుట్ల గిరిజన గూడెంలో సొంత నిధులులతో బోర్లు ఏర్పాటు చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
ఇన్‌సైడర్ న్యూస్(ప్రకాశం): పాలుట్ల గిరిజన గూడెం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తన సొంత నిధులతో రెండు బోర్లను ఏర్పాటు చేసి స్థానిక ప్రజల నీటి కొరత తీర్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గత నెలలో పాలుట్ల గిరిజన గూడెంలో పర్యటించినప్పుడు పాలుట్ల ప్రజలు మంచినీటి సదుపాయం లేక పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ హానిమి బాయి, సురేష్ నాయక్ ,హనుమా నాయక్,తులసినాయక్, కుడుముల అంజయ్య, రాములు నాయక్, నాగేనాయక్,సేవనాయక్ గౌరవ మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బోర్లను తవ్వించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పాలుట్ల గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలియచేశారు.
For more news visit : https://amoolyaservices.com/blog/
Leave a Reply