జగనన్న విద్యాకానుకతో విద్యాభివృద్ధి
– ఆనందపురం గ్రామ సర్పంచి చందక లక్ష్మి

జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయని విశాఖపట్నం జిల్లా ఆనందపురం గ్రామ సర్పంచి చందక లక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నాడు`నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారని తెలిపారు. ఐఎఫ్‌పి ప్యానల్స్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో బోధించే అధునాతన సౌకర్యాలను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
– ఆనందపురం పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ చందక అప్పలనాయుడు

ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ చందక అప్పలనాయుడు పేర్కొన్నారు. పాఠశాలలో, పాఠశాల బయట విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందించిన యూనిఫామ్, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగు, షూ ఖచ్చితంగా ధరించేలా విద్యార్థుల తల్లిదండ్రులు బాధ్యతీసుకోవాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. తమ విద్యార్థుల ప్రగతిని తెలుసుకోడానికి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పాఠశాలను సందర్శించాలని పేర్కొన్నారు.
For more news: visit our news page: https://amoolyaservices.com/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6/

Leave a Reply