
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ‘ముద్దబంతి’ సినిమా తెలుగు, కన్నడ, తమిళంలో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు మన్మథరెడ్డి ఫేమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.టి.నాయుడు తెలిపారు. ఇన్‌సైడర్ సినిమాతో ఆదివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ 90 శాతం నూతన నటీనటులతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్.బాలు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గిరిజన సంప్రదాయ కోణాన్ని స్పృశిస్తూ ఒక విభిన్నమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఒకరిద్దరు సీనియర్ ఆర్టిస్టులు కేరెక్టర్ ఆర్టిస్టులను ఈ చిత్రంలో నటిస్తారని తెలిపారు. అన్ని వయస్సుల సినీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే కథాంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పారు. సస్సెన్స్, వినోదం, సందేశం, ప్రేమ కథ అన్నింటి కలయికగా చిత్రీకరణ చేస్తామని తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేసి అనంతరం పూర్తిస్థాయిలో షూటింగ్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్, అరకు, బెంగళూరు లొకేషన్లలో కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు
For more news click here

Leave a Reply