ఇన్‌సైడర్ న్యూస్(విశాఖపట్నం): కీర్తి శేషులు మజ్జి అప్పారావు స్మారకార్థం ఎం.ఎ.ఆర్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 24 నుండి ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో జరగనుంది. భీమునిపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభిస్తారు. టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్టుకు 25 వేల రూపాయలు, రన్నరప్ జట్టుకు 15 వేల రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 10 వేల రూపాయలు ప్రైజ్ మనీగా అందించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ కమిటీ సభ్యులుగా ఆనందపురం మండలం వైసిపి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ సర్పంచ్ మజ్జి వెంకటరావు, మజ్జి సత్యనారాయణ, ఆనందపురం మండల పరిషత్ అధ్యక్షురాలు డాక్టర్ మజ్జి శారద ప్రియాంక, మజ్జి ప్రదీప్, మజ్జి జానకి రామయ్య, మజ్జి భూపతి నాయుడు, మజ్జి గౌతమ్, మజ్జి నందీశ్వరరావు, కిలారి సన్యాసప్పడు వ్యవహరించనున్నారు.
నిర్వహణ ఏర్పాట్లు పూర్తి
మండలంలో వివిధ గ్రామాల నుండి మొత్తం 42 క్రికెట్ జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పోటీల నిర్వహణకు సంబంధించిన డ్రా లిస్టులు ఇప్పటికే తయారు చేసినట్లు నిర్వాహక కమిటీ తెలియజేసింది. ఏ రోజు ఏ జట్టుతో ఏ జట్టుకు మ్యాచ్ జరుగుతుందనే తేది, సమయం తదితర వివరాలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. టోర్నీ మొత్తం 41 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
24న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యే టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆనందపురం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, వివిధ గ్రామాల పెద్దలు, క్రీడాభిమానులందర్నీ ఆహ్వానిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.
త్వరలో విగ్రహం, గ్రంథాలయం ఏర్పాటు
సామాజిక సేవా కార్యక్రమాల్లో, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే గ్రామంలోని పేదలకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండి సహాయం చేసిన కీ॥శే॥మజ్జి అప్పారావు సేవలకు గుర్తుగా గ్రామ ప్రజలు, పెద్దలు, యువత ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆయన పేరు మీద కుటుంబీకులు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు.
Leave a Reply