60 ప్లస్ మూడు విభాగాల్లో శిష్టా శ్రీలక్ష్మికి మొదటి స్థానం
ఇన్‌సైడర్ న్యూస్, విశాఖ సిటి(క్రీడలు): విశాఖ జిల్లా మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో ఆదివారం (అక్టోబర్ 8) జరిగిన పోటీల్లో 60 ప్లస్ కేటగిరీలో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, 100 మీటర్స్ రన్ విభాగాల్లో శిష్టా శ్రీలక్ష్మి మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన కె.సుందర రామరాజు, గౌరవ అధ్యక్షులు కే గణపతి రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి ప్రభుదాస్ ఆమెను అభినందించారు . 35 ప్లస్, నుండి 85 ప్లస్ వయస్సుల కేటగిరీల్లో పురుషులు, మహిళలకు జరిగిన ఈ జిల్లా స్థాయి క్రీడల్లో సుమారు 200 మందికి పైగా వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్ 9 ,10 తేదీలలో జరుగు రాష్ట్ర స్థాయి క్రీడలలో విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తారని నిర్వాహకులు తెలియజేశారు.
Leave a Reply